ఆ రోజు నుంచి ఓటీటీలో స్కంద..
23 October 2023
ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని డ్యూయల్ రోల్ లో తెరకెక్కిన యాక్షన్ చిత్రం స్కంద.
ఈ చిత్రంలో రామ్ కి జోడిగా యంగ్ బ్యూటీ శ్రీలీల కథానాయకిగా కనిపించింది. హీరోయిన్ సాయి మంజ్రేకర్ ఓ ముఖ్య పాత్రలో నటించింది.
బాలయ్యతో అఖండ తర్వాత బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
శ్రీనివాస్ శివే స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి, పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిచారు. థమన్ ఈ మూవీ సంగీత దర్శకుడు.
సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. క్లైమాక్స్ లో ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉన్నట్టు ప్రకటించారు.
భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం ప్రక్షకులను, అభిమానులను నిరాశ పరిచింది. దీంతో డిజిటల్ విడుదలకు సిద్ధమైంది.
ఈ నెల (అక్టోబర్) 27న డిజిటల్ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఓటీటీ ప్రేక్షకుల ముందుకున్ రానుంది ఈ సినిమా.
ఇంద్రజ, శ్రీకాంత్, ప్రిన్స్ సెసిల్, ప్రభాకర్, గౌతమి, దగ్గుబాటి రాజా తిదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి