02 October 2023
కన్నడ స్టార్ డా. శివరాజ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా ‘ఘోస్ట్’. దర్శకుడు శ్రీని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ దీనికి నిర్మాత.
అక్టోబర్ 19న దసరా కానుకగా కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషల్లో భారీ స్థాయిలో విడుదలకి సిద్ధమవుతుంది. తాజాగా ఘోస్ట్ ట్రైలర్ విడుదలైంది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్, దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా సంగీత దర్శకుడిపై ఇన్ని రోజులు సస్పెన్స్ మెయింటేన్ చేసారు మేకర్స్. తాజాగా దానికి తెరపడింది.
ఇస్మార్ట్ శంకర్‌కి అదిరిపోయే మాస్ ఆల్బమ్ ఇచ్చిన సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ వైపు పూరీ అడుగులు వేస్తున్నారు. ఒక పాటకు సంబంధించిన ఫైనల్ కంపోజింగ్ కూడా ఓకే అయిపోయిందని తెలుస్తుంది.
జైలర్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టడంతో రజినీ నటిస్తున్న తర్వాతి సినిమాలపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఈ లైనప్‌లో టాలెంటెడ్ దర్శకుడు టి జి జ్ఞానవేల్‌తో రజిని ఓ సినిమా చేయబోతున్నారు.
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న సినిమాపై ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. ఇందులో ముందు శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకున్నా.. ఆమె తప్పుకోవడంతో రష్మిక మందన్న వచ్చి చేరారు.
రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన స్కంద సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వస్తున్నాయి. మూడు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 34.4 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
షేర్ కూడా 18 కోట్లకు పైగా వచ్చాయి. 50 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కంద వీకెండ్ క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా చేస్తామంటూ ప్రకటించారు దర్శకుడు బోయపాటి.