మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్..
TV9 Telugu
02 July 2024
కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్‌కి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు వరుస సినిమాలు కమిట్ అవుతున్నారు.
ఇప్పటికే ఐదు ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టిన ఈ యంగ్ హీరో తాజాగా మరో మూవీకి డిస్కషన్స్ స్టార్ట్ చేశారు.
తనతో డాన్ లాంటి సూపర్ హిట్ సినిమా చేసిన యంగ్ డైరెక్టర్ సిబి చక్రవర్తితో మరో మూవీకి రెడీ అవుతున్నారు.
ఈ ఏడాది సంక్రాంతికి అయలన్ అనే ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ.. సినిమా మెప్పించలేదు.
దీనికి ముందు 2023లో వచ్చిన మావీరన్ (తెలుగులో మహావీరుడు) ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. దీనికి ముందు ప్రిన్స్ ప్లాప్ అయింది.
ఇటీవల ఈయన హీరోగా బయోగ్రాఫికల్ వార్ ఫీల్మ్ అమరన్ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది.
ప్రస్తుతం AR మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ చిత్రం షూటింగ్ లో ఉన్నారు. ఇది SK23 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతుంది.
ప్రస్తుతం ఓ బెస్ట్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు శివ కార్తికేయన్. చుడాలిక ఏ సినిమాతో హిట్ రానుందో అని.