టీనేజ్‌లోకి రాకముందే తండ్రిని మించిపోయిన సితార 

మహేశ్ కూతురు సితారని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం.

మహేశ్, నమ్రత షేర్ చేసే ఫొటోలు, వీడియోల వల్ల సితార ఎలా ఉంది, ఏం చేస్తుందనేది తెలుస్తూనే ఉంది.

ఓ పక్క సినిమాలు, యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస‍్తూ బిజీగా ఉన్నాడు మహేశ్‌బాబు

ఇప్పుడు అతడికి పోటీగా కూతురు సితార కూడా వచ్చేసింది.

మహేశ్‌నే అవాక్కయ్యేలా చేసినట్లు కనిపిస్తుంది సితార.

ఎందుకంటే ఏకంగా పాన్ వరల్డ్ రేంజులో ఎంట్రీ ఇచ్చింది.

ఓ నెలరోజుల క్రితం జరిగిన ఈ యాడ్ షూట్ లో సితార పాల్గొనడం ఓ విధంగా రికార్డ్.

ఎందుకంటే టీనేజ్ లోకి రాకముందే ఇలా మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిందని తెలియగానే అభిమానులు చాలా సంతోషపడ్డారు.

ఇప్పుడు ఏకంగా దాన్ని అమెరికాలోని ప్రఖ్యాత టైమ్ స్కేర్వ్ లో ప్రదర్శించారనేసరికి సోషల్ మీడియాలో ఆ ఫొటోలు, వీడియోలని వైరల్ చేస్తున్నారు.

డ్యాన్సర్‌గా అద్భుతమైన ప్రతిభ చూపిస్తున్న సితార.. ఇప్పుడు యాడ్ షూట్స్ లోకి కూడా వచ్చేసింది.

 తండ్రి ఇక్కడ యాడ్స్ చేస్తుంటే.. సితార మాత్రం అమెరికా నుంచి మొదలుపెట్టింది.