మహేశ్ తనయుడు గౌతమ్ ఇప్పుడు ఏం చదువుతున్నాడో తెలుసా?

TV9 Telugu

28 August 2024

మహేశ్ బాబు- నమ్రతా శిరోద్కర్‌ల తనయుడు గౌతమ్ ఘట్టమనేని, కూతురు సితార ఘట్టమేనికి ఇప్పటికే మస్త్ క్రేజ్ వచ్చేసింది.

ఇంకా సినిమాల్లోకి రానప్పటికీ  స్టార్ కిడ్స్ గా సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు సితార, గౌతమ్

కాగా తన తనయుడు గౌతమ్ ఘట్టమనేని, కూతురు సితార ఇద్దరూ కూడా సినిమాల్లోకి వస్తారని గతంలోనే మహేష్ బాబు తెలిపాడు.

గౌతమ్ ఘట్టమనేని ఇప్పటికే మహేశ్ బాబు హీరోగా నటించిన వన్ – నేనొక్కడినే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు.

అయితే దీని తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన గౌతమ్ ఘట్టమనేని విదేశాల్లో చదువును కొనసాగిస్తున్నాడు.

తాజాగా సితార ఘట్టమనేని పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన అన్నయ్య గౌతమ్ గురించి మాట్లాడుతూ.. అన్నయ్య కూడా యాక్టర్ అవుతాడంది.

అన్నయ్య గౌతమ్ ప్రస్తుతం న్యూయార్క్ యూనివర్సిటీలో నాలుగేళ్ల డ్రామా కోర్స్ చేస్తున్నాడని సితార ఈ ఇంటర్వ్యూలో తెలిపింది

 కాగా గౌతమ్ లండన్ ప్రఖ్యాత యూనివర్సిటీ డ్రామా కోర్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల కాలేజీలో గౌతమ్ నాటకం కూడా వేశాడు