25 May 2024

మహేష్ బాబుకు అలా చేస్తే అసలు నచ్చదట.. ఆ విషయం సితార చెప్పేసింది.. 

Rajitha Chanti

Pic credit - Instagram

సూపర్  స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఎస్ఎస్ఎంబీ 29 స్టార్ట్ కానుంది. 

కొన్నిరోజులుగా  ఈ మూవీ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న మహేష్.. అటు ఖాళీ సమయాన్ని ఫ్యామిలీతో ఎక్కువగా గడిపేస్తున్నారు

ఇటీవల ఓ ఫ్యామిలీ ఫంక్షన్‏లో పాల్గొన్న మహేష్.. అక్కడ తన సోదరి మంజులతో సరదాగా మాట్లాడారు. ఆ పార్టీ వీడియోస్ వైరలయ్యాయి. 

ఈ వీడియోలో మంజుల మహేష్ హెయిర్ టచ్ చేస్తూ మాట్లాడుతుండడంతో డిఫరెంట్ ఎక్స్‏ప్రెషన్స్ ఇచ్చి దూరంగా జరిగేందుకు ప్రయత్నిస్తారు. 

ఇక ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో సితారను ప్రశ్నించింది యాంకర్. ఆ వీడియోలో కనిపిస్తున్న మూమెంట్‏లో ఏం జరిగిందని ప్రశ్నించింది. 

సితార మాట్లాడుతూ.. నాన్నకు ఎవరు హెయిర్ టచ్ చేసిన అసలు ఇష్టం ఉండదని, అప్పుడప్పుడు తను కూడా టచ్ చేసి ఆట పట్టిస్తానని తెలిపింది. 

 ప్రస్తుతం సితార చెప్పిన విషయం నెట్టింట వైరల్ అవుతుంది. తమ హీరో మహేష్‏కు హెయిర్ టచ్ చేయడం అసలు ఇష్టముండదని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. 

 త్వరలోనే రాజమౌళి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నారు. ఇందులో మహేష్ సరికొత్త లుక్‏లో కనిపించనున్నారు. అందుకే లాంగ్ హెయిర్‎తో కనిపిస్తున్నారు.