సితార ఇన్‌స్టాగ్రామ్ నుంచి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?

23 September 2024

Basha Shek

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని క్రేజ్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు

ఇంకా సినిమాల్లో రానప్పటికీ స్టార్ కిడ్ గా  సోషల్ మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేక పాపులారిటీని సంపాదించుకుంది.

సోషల్ మీడియాలో  ఎంతో యాక్టివ్‌గా ఉండే సితార తన వీడియోలతో పాటు, ఫోటోలను అందులో పంచుకుంటుంది.

తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఫాలోవర్స్‌ను మరింతగా పెంచుకుంటోంది.

ఈ క్రమంలోనే సితార ఘట్టమనేని  ఇ‌న్‌స్టాగ్రామ్ ద్వారా పెద్ద మొత్తంలోనే ఆదాయం ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది.

సితార కేవలం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నెలకు సుమారు 30 లక్షల నుంచి 35 లక్షల వరకు సంపాదిస్తుందని నెట్టింట టాక్.

ఇక గుంటూరు కారం తర్వాత గ్యాప్ తీసుకున్న మహేశ్ బాబు తన తర్వాతి సినిమా కోసం రెడీ అవుతున్నారు

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఓ అడ్వెంచెరస్ థ్రిల్లర్ నేపథ్యం మూవీలో మహేశ్ బాబు నటిస్తున్నాడు