సీతా కళ్యాణ వైభోగమే.. ఆడు జీవితం రికార్డు..

TV9 Telugu

07 April 2024

సుమన్ తేజ్, గరీమ చౌహన్ జంటగా సతీష్ పరమవేద దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్ డ్రామా సినిమా సీతా కళ్యాణ వైభోగమే.

డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత రాచాలా యుగంధర్ ఈ చిత్రాన్ని ప్రతిస్త్మాకంగా నిర్మిస్తున్నారు.

టైటిల్‌తోనే సినిమాపై ఆసక్తి పెంచేసారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఈ సినిమా.

భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ చిత్రం రాబోతోందంటున్నారు మేకర్స్. తాజాగా ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా బ్లెస్సీ తెరకెక్కించిన సర్వైవల్ డ్రామా సినిమా ఆడు జీవితం.

విడుదలైన తొలిరోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మలయాళంలో అద్భుతాలు క్రియేట్ చేస్తుంది.

అత్యంత వేగంగా 100 కోట్లు వసూలు చేసిన మలయాళ సినిమాగా చరిత్ర సృష్టించింది పృథ్వి రాజ్ ఆడు జీవితం సినిమా.

ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు మంచి అప్లాజ్ వస్తుంది. ఇంగ్లీష్ లో ది గోట్ లైఫ్ అనే టైటిల్ తో ఈ చిత్రాన్ని విడుదల చేసారు.