అందంలో కుందనపు బొమ్మలా ఆకట్టుకుంటున్న సిరి..

05 October 2023

కొన్ని టీవీ చానెల్స్ లో న్యూస్ రీడర్ గా, రిపోర్టర్ గా తన కెరీర్ మొదలుపెట్టింది అందాల భామ సిరి హనుమంత్.

తర్వాత యూట్యూబ్ లో ఎన్నో షార్ట్స్ ఫిల్మ్స్, సిరీస్ లలో లీడ్ రోల్ లో నటించి మెప్పించింది. ఇన్ స్టా రీల్స్ తో కూడా బాగా ఫేమస్ అయింది.

నటనలో తన కెరీర్‌ను ప్రారంభించే ముందు, ఆమె అందాల పోటీలో పాల్గొని 'మిస్ బ్యూటిఫుల్ స్మైల్' టైటిల్‌ను అందుకుంది.

‘ఎవరే నువ్వు మోహిని’, ‘సావిత్రమ్మ గారి అబ్బాయి’, ‘అగ్నిసాక్షి’ వంటి అనేక తెలుగు టీవీ సీరియల్స్‌లో నటించింది.

‘ఇద్దరి లోకం ఒకటే’, ‘ఒరే బుజ్జిగా’ వంటి తెలుగు చిత్రాలలో నటించి మెప్పించింది అందాల భామ సిరి హనుమంత్.

2021లో ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 5’ (తెలుగు)లో కంటెస్టెంట్ గా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

ఇటీవల లావణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పులి మేక అనే ఓ జీ5 వెబ్ సిరీస్ లో నటించింది ఈ బ్యూటీ.

ఇటీవల 100% లవ్ అనే ఓ టెలివిషన్ షోలో తన ప్రియుడు శ్రీహాన్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది అందాల తార సిరి హనుమంత్.