ఈ సొగసరి అందాలు చూస్తే మైమరచిపోరా కుర్రకారు

TV9 Telugu

06 June 2024

బిగ్‌ బాస్‌ షోలో రచ్చ చేసింది సిరి హన్మంతు. ఐదో సీజన్‌లో పాల్గొని ఆమె టాప్‌ 5కి చేరుకుంది. షో ద్వారా వచ్చిన క్రేజ్‌ని వాడుకుంటూ దూసుకుపోతుంది. 

సోషల్‌ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకుంది సిరి హన్మంతు. ఆమె యూట్యూబ్‌ వీడియాలతో మరింతగా పాపులర్‌ అయ్యింది. యూట్యూబర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 

ఆ గుర్తింపుతోనే బిగ్‌బాస్‌లోకి వచ్చింది. బిగ్‌ బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో పాల్గొంది సిరి. ప్రారంభం నుంచి తనదైన ఆట తీరుతో అలరించింది. 

సిరి హన్మంతు బిగ్‌ బాస్‌తో వచ్చిన క్రేజ్‌ని ఉపయోగించుకుంటూ ఓ వైపు టీవీ షోస్‌, మరోవైపు యాంకర్‌గా, ఇంకోవైపు నటిగా రాణిస్తుంది.

సిరి, మరో బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ శ్రీహాన్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఈ ఇద్దరు సహజీవనం కూడా చేస్తున్నారని సమాచారం.

 లైఫ్‌లో సెటిల్‌ అయ్యాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. సిరికి గతంలో ఓ లవ్‌ స్టోరీ ఉంది. అలాగే ఓ కొడుకుని పెంచుకుంటున్నారు.  

సిరి హన్మంతు సోషల్‌ మీడియాలో బిజీగా ఉంటుంది. చాలా యాక్టివ్‌గా ఉంటుంది. నెటిజన్లకి తన పోస్ట్ లతో టచ్‌లో ఉంటుంది. ఆ ఫాలోయింగ్‌ని మరింత పెంచుకుంటుంది. 

బిగ్‌ బాస్‌ బ్యూటీ సిరి హన్మంతు లేటెస్ట్ షేర్ చేసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లకి ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి.