TV9 Telugu

గీతామాధురికి తారక్‌ ఏమవుతాడు?

05 March 2024

అదేం ప్రశ్న.. గీతా మాధురి సింగర్‌. తారక్‌ స్టార్‌ హీరో. వీరిద్దరూ ఒకరికొకరు ఏమవుతారు? ఏమీ అవ్వరుగా... అని అనుకుంటున్నారా?

జూనియర్‌ ఎన్టీఆర్‌ని తారక్‌ అని పిలుచుకోవడం సంగతి సరే... అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది గీతామాధురి కొడుకు తారక్‌ గురించి.

తాజాగా తన ముద్దుల తనయుడికి ధ్రువధీర్‌ తారక్‌ అని పేరు పెట్టారట సింగర్‌ గీతామాధురి, హీరో నందు దంపతులు.

బారసాల చేసి కొడుకు పేరును ప్రకటించారు గీతామాధురి, నందు దంపతులు. ఆ మధ్య గీతామాధురి సీమంతం ఫొటోలు వైరల్‌ అయ్యాయి.

ఇప్పుడు తారక్‌ బారసాల ఫొటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. గీతామాధురి, నందు దంపతులకు ఇదివరకే ఓ కూతురు ఉంది.

పాప పేరు దాక్షాయణి. ఇటీవల పుట్టిన మగబిడ్డకు ధ్రువధీర్‌ తారక్‌ అని పేరు పెట్టారు గీతామాధురి, నందు దంపతులు.

వెండి ఊయలలో తారక్‌ బారసాలను ఘనంగా నిర్వహించారు ఈ దంపతులు. కొంతమంది సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

ప్రముఖ సంగీత దర్శకుడు కల్యాణిమాలిక్‌తో పాటు పలువురు సంగీత ప్రముఖులు ఈ వేడుకకు హాజరై తారక్‌ని ఆశీర్వదించారు.