పెళ్లి చేసుకోవాలా ఏంటి.? ఇలానే బాగుంది..: హీరోయిన్ ఆండ్రియా
07 March 2024
ప్రస్తుతం ట్రెండ్ మారింది.. ఒక వయసు వచ్చాక పెళ్లి మాట పక్కన పెట్టి, సింగిల్‌గా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు.
ఈ విషయంలో సెలబ్రెటీలు ముందుంటున్నారు. ముఖ్యంగా కొందరు హీరోయిన్స్ పెళ్లి మాటకు దూరంగా ఉండడమే బెటర్ అంటున్నారు.
సౌత్ లో కొంతమంది హీరోయిన్స్ పెళ్లి గురించి ఆలోచించడమే లేదు. ఇక పెళ్లి ఎప్పటికి చేసుకోనంటుంది హీరోయిన్ ఆండ్రియా జెర్మియా.
ఆండ్రియా జెర్మియా తెలుగు, తమిళం, మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీకి అనుకున్న స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు.
తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. తనకు ఎప్పటికీ పెళ్లి చేసుకోవాలని లేదని తెలిపింది.
“20-25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ ఆ సమయంలో కుదరలేదు. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సంతోషిస్తానని కాదు..
పెళ్లి కాకపోయినా చాలా సంతోషంగా ఉంటాను.. ” అని చెప్పుకొచ్చింది. అయితే పెళ్లయినవాళ్లు ఎంత మంది సంతోషంగా ఉన్నారు? అంటూ తిరిగి ప్రశ్నించింది.
పెళ్లైన వాళ్ల గురించి మాట్లాడేందుకు తాను రెడీగా లేనని, ఈ జీవితానికి తాను అలవాటు పడ్డానని.. భవిష్యత్తులో కూడా ఎప్పటికీ పెళ్లి చేసుకోనని చెప్పుకొచ్చింది.