సలార్‌లో స్పెషల్‌.. సిమ్రత్‌తో డార్లింగ్‌!

11 November 2023

డార్లింగ్‌ ప్రభాస్‌ హీరోగా నటించిన సినిమా సలార్‌. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది.

సలార్‌ పార్ట్ 1 సీజ్‌ఫైర్‌ని యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. ప్రభాస్‌ టైటిల్‌ రోల్‌లో నటించారు. డిసెంబర్‌ 22న విడుదల కానుంది సలార్‌.

ఇటీవల ఫారిన్‌లో మోకాలికి శస్త్రచికిత్స చేసుకున్నారు ప్రభాస్‌. చికిత్స పూర్తయ్యాక కొన్నాళ్ల పాటు అక్కడ విశ్రాంతి తీసుకుని హైదరాబాద్‌కి తిరిగి వచ్చారు.

డిసెంబర్‌ ఫస్ట్ వీక్‌ నుంచి సలార్‌ ప్రమోషన్లను మొదలుపెట్టేలా ప్లాన్‌ చేస్తున్నారట డైరక్టర్‌ ప్రశాంత్‌నీల్.

సలార్‌లో స్పెషల్‌ సాంగ్‌ గురించి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ వైరల్‌ అవుతోంది. సిమ్రత్‌ కౌర్‌ స్పెషల్‌ సాంగ్‌ చేశారని టాక్‌.

ఇటీవల సిమ్రత్‌ కౌర్‌ నటించిన గదార్‌2కి మంచి స్పందన వచ్చింది. ఇందులో ఆమె నటించిన ముస్కాన్‌ కేరక్టర్‌ ఆడియన్స్ కి నచ్చింది.

దక్షిణాదిన కూడా ఇంతకు మునుపు కొన్ని సినిమాలు చేశారు సిమ్రత్‌ కౌర్‌. తెలుగులో ప్రేమతో మీ కార్తిక్‌లో నటించారు.

ఎమ్మెస్‌ రాజు తెరకెక్కించిన డర్టీ హరిలో ఆమె రోల్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కినేని నాగార్జున నటించిన బంగార్రాజులో కేమియో రోల్‌ చేశారు.