సిల్క్ స్మిత లేక 28 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పటికి ఆ పేరు ట్రేండింగ్ నే.!

Anil Kumar

16 July 2024

ఒకప్పుడు వెండితెరపై మైమరపించి.. ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో స్థిరంగా నిలిచిపోయిన భామల్లో సిల్క్ స్మిత ఒకరు.

సినీ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్ కు సిల్క్ స్మిత పెట్టింది పేరు. ఆమె డాన్స్ కి, అందానికి అభిమానులు ఫుల్.

తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషలలో కలిపి ఏకంగా 200 లకు పైగా సినిమాలలో నటించి మెప్పించింది స్మిత.

తన అందంతో.. ఆకట్టుకునే కళ్ళతో ఎంతో మంది హృదయాలను దోచేసింది వయ్యారి బ్యూటీ సిల్క్ 1996 లో మరణించింది.

అయితే.. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా ఇప్పటికే హిందీ, మలయాళ భాషల్లో రెండు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు కన్నడలో కూడా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్‌. దీనిపై అధికారిక ప్రకటన కూడా చేసారు.

ఈ సినిమాలో సిల్క్ స్మిత పాత్రలో పాకిస్తానీ నటి వీణా మాలిక్ నటిస్తున్నారు అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

త్రిసూల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను 16 భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌.