ఈ ఏడాది సైమా ఉత్తమ నటులు, దర్శకులు వీరే.. 

15 September 2024

Battula Prudvi 

బ్లాక్ బస్టర్ దసరా సినిమాలో హీరోగా నాచురల్ స్టార్ నానికి నటనకు ఉత్తమ నటుడుగా సైమా అవార్డు 2024 వరించింది.

దసరా సినిమాలో సెకండ్ హీరోగా, నాని స్నేహితుడిగా దీక్షిత్‌ శెట్టి ఉత్తమ సహాయ నటుడుగా సైమా అవార్డు లభించింది.

మ్యాడ్ సినిమాలో హీరోగా తనదైన నటనతో ఆకట్టుకున్న సంగీత్‌ శోభన్‌‎కి ఉత్తమ పరిచయ నటుడుగా సైమా అవార్డు లభించింది.

2023 యూత్‎ఫుల్ కామెడీ బ్లక్ బస్టర్ మ్యాడ్‌ సినిమాలో విష్ణు నటనకు ఉత్తమ హాస్య నటుడుగా సైమా అవార్డు వరించింది.

సైమాలో క్రిటిక్స్‌ ఉత్తమ నటుడు అవార్డు బ్లాక్ బస్టర్ సినిమా బేబీలో హీరోగా తన నటనకుగాను ఆనంద్‌ దేవరకొండకి లబించింది.

హిట్ బొమ్మ దసరా దర్శకత్వం వహించిన శ్రీకాంత్‌ ఓదెల సైమా అవార్డ్స్‎లో ఉత్తమ దర్శకుడుగా అవార్డు గెలుపొందారు.

నాని హీరోగా హాయ్‌ నాన్న సినిమా తెరకెక్కించిన నూతన దర్శకుడు శౌర్యువ్‌ ఉత్తమ పరిచయ దర్శకుడుగా సైమా అవార్డు గెలుపొందారు.

బేబీ సినిమాను రూపొందించిన దర్శకుడు సాయి రాజేశ్‌ క్రిటిక్స్‌ ఉత్తమ దర్శకుడుగా సైమా అవార్డును గెలుపొందారు.