ఇమేజ్ మార్చుకునే పనిలో పడ్డా టిల్లు..

11 December 2023

ఒక్క సినిమా చాలు ఇండస్ట్రీ అంతా మాట్లాడుకోడానికి..! అలాంటి సినిమానే డిజే టిల్లు.. ఆ హీరోనే సిద్ధూ జొన్నలగడ్డ.

పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న.. డిజే టిల్లుతో రాత్రికి రాత్రే స్టార్ బాయ్ అయిపోయారు సిద్ధూ జొన్నలగడ్డ.

ప్రస్తుతం ఈ చిత్ర సీక్వెల్ డిజే టిల్లు స్క్వేర్‌తో బిజీగా ఉన్నారీయన. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. సినిమా 2024, ఫిబ్రవరి 9న విడుదల కానుంది.

సిద్ధూకి ఇండస్ట్రీలో డిమాండ్ బాగా పెరిగిపోయిందిప్పుడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌తో ఓ సినిమా మొదలుపెట్టారు.

అలాగే వరసగా లేడీ డైరెక్టర్స్‌‌తోనే సినిమాలు చేస్తున్నారు. నీరజ కోనతో తెలుసు కదా అనే మూవీ ఈ మధ్యే మొదలైంది.

ఆ మధ్య నందిని రెడ్డితో ఓ సినిమా అనుకున్నా అది ఆగిపోయింది. నీరజ కోన సినిమా మాత్రం షూటింగ్ జరుపుకుంటుంది.

మరోవైపు బొమ్మరిల్లు భాస్కర్ సినిమా సెట్స్‌పైనే ఉంది. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలతో తన ఇమేజ్ మారిపోతుందని చెప్తున్నారు సిద్ధూ.

రఫ్ అండ్ టఫ్ కాకుండా.. పక్కింటి కుర్రాడి ఇమేజ్ కోసం చూస్తున్నారీయన. మరి ఆ ఇమేజ్ వీటితో వస్తుందో లేదో చూడాలి.