TV9 Telugu

ఓజి షూటింగ్ లో ప్రియాంక మోహన్ న్యూ ఫోటోషూట్

24 March 2024

స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ , అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది.

ఈ సినిమా మార్చి 29న విడుదల కానుంది. విడుదలకు వారం ముందుగానే సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసేసుకుంది ఈ చిత్రం.

ఈ సినిమాకి సెన్సార్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి.

ఇందులో అడల్ట్ కంటెంట్ ఉందనే టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఈ సెన్సార్ సర్టిఫికేట్ క్లారిటీ ఇచ్చినట్లైంది.

టిల్లు స్క్వేర్‌ సినిమాపై ఎన్నో అనుమానాలు ఉండటంతో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు హీరో సిద్ధూ జొన్నలగడ్డ.

ఈ సినిమా మొదటి భాగం డీజే టిల్లు తో లింక్ ఉంటూ కథ ముందుకు సాగుతుందని చెప్పారు సిద్దు. ఇంకా మాట్లాడుతూ..

కొత్త పరిస్థితులు, కొత్త అమ్మాయి మరికొన్ని కొత్త పాత్రలు ఈ మూవీ పరిచయం అవుతాయని తెలిపారు హీరో సిద్ధూ.

డిజే టిల్లు మాదిరిగానే  ఈ సినిమా కూడా కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్ గా ఉంటుంది అన్నారు సిద్ధూ జొన్నలగడ్డ.