టిల్లు స్క్వేర్ ఓటీటీ అన్ని కోట్లకి అమ్ముడుపోయిందా

TV9 Telugu

03  April 2024

ఆల్రెడీ థియేటర్లలో... దుమ్ములేచేలా డీజే సౌండ్ చేస్తున్న టిల్లు గాడు.. ఓటీటీ సర్కిల్లో కూడా హాట్ టాపిక్ అవుతున్నాడు.

ఓటీటీలో కూడా రికార్డులు క్రియేట్ చేసేలానే ఉన్నాడు. అందుకే అన్నట్టు.. మంచి ఫ్యాన్సీ రేటుకు అమ్ముడయి.. ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్నాడు.

సిద్ధు హీరోగా.. మల్లిక్ రామ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ టిల్లు స్క్వేర్. డీజె టిల్లుకు సీక్వెల్‌గా తెరకెక్కి రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్స్‌ కుమ్మేస్తోంది.

థియేటర్లకు వచ్చిన జనాలను విపరీతంగా ఎంటర్ టైన్ చేస్తోంది. దీంతో ఈ మూవీకి ఓటీటీ ఫీల్డ్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది.

ఇక అందేకే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ టిల్లు స్క్వేర్ సినిమాను ఫ్యాన్సీ రేట్‌కు కొనిందట. దాదాపు 15 కోట్లు పెట్టి మరీ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకుందట.

అయితే ఇదే న్యూస్ అటు ఓటీటీ సర్కిల్స్‌లోనూ.. ఇటు టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో కూడా విపీరతంగా వైరల్ అవుతోంది.

'టిల్లు స్క్వేర్' ఓవర్సీస్‌లో హవాను చూపిస్తుంది 2 మిలియన్ మార్కును చేరుకోవడంతో నార్త్ అమెరియాలో వేగంగా  మార్కును చేరుకున్న మొదటి మీడియం రేంజ్ మూవీగా రికార్డు సాధించింది.