TV9 Telugu
యోధా ట్రైలర్ అప్డేట్.. ఆర్టికల్ 370 బ్యాన్..
27 Febraury 2024
సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ యోధా. రాశి ఖన్నా, దిశా పటాని ఇందులో హీరోయిన్లు.
సాగర్ అంబ్రే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీంతో ప్రమోషన్ స్పీడు పెంచిన మేకర్స్ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 29న గ్రాండ్ ఈవెంట్‌లో ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు.
టబు, కరీనా కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా క్య్రూ. కార్పోరేట్ ఏవియేషన్ బిజినెస్ నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది.
ఓ విమానం హైజాకింగ్, దొంగతనం నేపథ్యంలో క్య్రూ సినిమా నడుస్తుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. సినిమా మార్చ్ 29న విడుదల కానుంది.
గతవారం విడుదలైన ఆర్టికల్ 370 సినిమాకు మంచి స్పందన వస్తుంది. గత కొన్నేళ్లుగా కశ్మీర్‌లో జరిగిన పరిణామాలు, అక్కడి రాజకీయాల నేపథ్యంలోనే తెరకెక్కించారు.
యమీ గౌతమ్, ప్రియమణి నటించిన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా రావడమే కాదు.. వివాదమూ అలాగే రేగుతుంది. ఈ సినిమాను గల్ఫ్ దేశాల్లో బ్యాన్ చేసారు.
పాకిస్తాన్ నేపథ్యంతో కథ సాగడమే దీనికి కారణం. ఈ మధ్యే హృతిక్ రోషన్ ఫైటర్ సినిమాను ఇలాగే బ్యాన్ చేసారు గల్ఫ్ డిస్ట్రిబ్యూటర్లు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి