TV9 Telugu
24 February 2024
రీ రిలీజ్ కు రెడీ అయిన సిద్దార్థ్ మరో రొమాంటిక్ మూవీ బొమ్మరిల్లు
రీరిలీజ్ ట్రెండ్ ఇప్పుడు సినీ ప్రియులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.ఇక ఇప్పుడు మరో మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది.
అదే ‘బొమ్మరిల్లు’ సినిమా.. ఒకప్పుడు హీరో సిద్ధార్థ్ కు టాలీవుడ్ లో ముఖ్యంగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండేది.
బాయ్స్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకులకు , యూత్ కు బాగా దగ్గరయ్యాడు.
ఇక ఇప్పుడు సూపర్ హిట్ బొమ్మరిల్లు మూవీ మళ్లీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అది ఎప్పుడంటే.?
ఈ సినిమాను ఏప్రిల్ నెలలో హీరో సిద్ధార్థ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీని మళ్లీ రిలీజ్ చేయాలనుకుంటున్నారట.
భాస్కర్ దర్శకత్వంలో సిద్ధార్థ్, జెనీలియా జంటగా నటించిన మూవీ ఇది. ఈ మూవీతో భాస్కర్ పేరు బొమ్మరిల్లు భాస్కర్ గా మారింది.
2006లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో ప్రకాష్ రాజ్, జయసుధ, కోట శ్రీనివాస్ రావు కీలకపాత్రలు పోషించారు.
కంటెంట్ పరంగానే కాకుండా మ్యూజిక్ పరంగానూ ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అప్పుడే ఉత్తమ చిత్రం కేటగిరిలో నంది అవార్డ్ అందుకుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి