సిద్ధార్థ్, అదితిలలో ముందుగా ఎవరు లవ్‌ను ప్రపోజ్ చేశారంటే?

TV9 Telugu

29 May 2024

రొమాంటిక్ హీరో సిద్దార్థ్‌, బాలీవుడ్ హీరోయిన్‌ అదితి రావు హైదరీ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారీ లవ్ బర్డ్స్

ఈ ఏడాది మార్చిలో  వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో ఈ ఇద్దరూ ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు.

ఇరు కుటుంబాల పెద్దలతో పాటు అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరలయ్యాయి.

మంచి శుభ ముహూర్తం చూసుకుని త్వరలోనే అదితీ రావు హైదరి, సిద్ధార్థ్ పెళ్లిపీటలెక్కనున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ద్ధార్థ్, అదితి రావు  కలిసి మహాసముద్రం అనే సినిమాలో నటించారు. అప్పటి నుంచి ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారట.

కాగా మొదట సిద్ధార్థ్ నే అదితీకి లవ్ ప్రపోజల్ చేశాడట. ఈ విషయాన్నిఅతనే ఇటీవల స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత అదితీ రావు హైదరీ కూడా వెంటనే యస్ అని చెప్పడంతో సిద్ధార్థ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయట.

కాగా అదితి నటించిన 'హీరామండీ: ది డైమండ్‌ బజార్‌'  వెబ్‌సిరీస్‌ సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు వచ్చాయి.