సిద్ధార్థ్, అదితి ఇద్దరి ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
TV9 Telugu
30 March 2024
సిద్ధార్థ్, అదితి పెళ్లి మ్యాటర్ నెట్టింట వైరలవుతుండగా.. వారిద్దరి పర్సనల్ విషయాలను తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ క్రమంలోనే కొంత మంది వీరి ఆస్తుల గురించి కూపీ లాగి.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యేలా చేస్తున్నారు.
సిద్ధార్థ్ తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించాడు. 2003లో బాయ్స్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన సిద్ధ్.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.
అకార్డింగ్ సమ్ రిపోర్ట్స్ సిద్ధార్థ్ ఆస్తులు దాదాపు 70 కోట్లు కాగా రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్, ఆడి A4 వంటి లగ్జరీ కార్లు ఉండగా హైదరాబాద్, చెన్నై, ముంబై ప్రాంతాల్లో సొంతంగా ఇళ్లు కూడా ఉన్నాయి.
ఇక అదితి రావ్ హైదరీ వనపర్తి రాజవంశస్తురాలు. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించింది. ఆమె నికర విలువ దాదాపు 60-62 కోట్లు.
ఒక్క సినిమాకు దాదాపు ఒక కోటి రెమ్యునరేషన్ తీసుకుంటుందని. అలాగే బ్రాండ్స్ ఎండార్స్మెంట్స్ ద్వారా 40 లక్షల వరకు సంపాదిస్తుంది.
హైదరాబాద్, ముంబై ప్రాంతాల్లో విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. ఆమె వద్ద ఆడి క్యూ 7, మెర్సిడెస్ బెంజ్ క్యూఎల్ఎస్, బిఎమ్డబ్ల్యూ ఎక్స్ 7 వంటి లగ్జరీ కార్ల ఉన్నాయి.
ఇక వీరిద్దరి ఆస్తులు కలిపి చూస్తూ.. వీరిద్దరి నికర విలువ మొత్తం 130 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.