06 May 2025
సమంతకు అలాంటి సీన్స్ అంటే చాలా ఇష్టమట.. ఫెవరేట్ ప్లేస్ ఇదే..
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇప్పుడు నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ట్రాలాలా పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించింది సామ్.
నిర్మాతగా మారిన తర్వాత సమంత నిర్మిస్తున్న మొదటి సినిమా శుభం. ఈ మూవీ మే 9న అడియన్స్ ముందుకు రానుండగా.. ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
ఇందులో సమంత అతిథి పాత్రలో కనిపించనున్నారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పక్కా కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా యాంకర్ సమంత గురించి ప్రశ్నలు అడగ్గా.. ఈ మూవీ నటీనటులు స్పందిస్తూ క్రేజీ ఆన్సర్స్ ఇచ్చారు.
సమంతకు ఎలాంటి సన్నివేశాలు ఇష్టమని అడగ్గా.. ఈ మూవీలో భార్య.. తన భర్తను కొట్టే సీన్ సమంత బాగా ఎంజాయ్ చేశారని చెప్పుకొచ్చారు.
అలాగే సామ్ కామెడీని ఎక్కువగా ఇష్టపడతారని అన్నారు. షూటింగ్ గ్యాప్ లో సమంత ఎక్కువగా మెడిటేషన్ చేస్తుంటారని అన్నారు శుభం టీమ్.
ఇన్ స్టాలో సామ్ ఎక్కువగా ఉపయోగించే ఎమోజీ స్వాగ్ అని చెప్పగా.. రాంగ్ అన్నారు సామ్. తాను ఎక్కువగా హార్ట్ ఎమోజీ వాడతానని అన్నారు.
ఇక సమంతకు ఇష్టమైన ప్లేస్ విశాఖపట్నం అని.. ప్రస్తుతం సమంత ఊతపదం శుభం అని అన్నారు. సమంతకు శుభం సినిమా అంటే ఇష్టమని అన్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్