దేవరకు భార్యగా నటించేది ఈమె

TV9 Telugu

24  March 2024

ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ నటిస్తోన్న సినిమా కావడంతో దేవర పై అటు నార్త్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ హైప్ నెలకొంది.

ఇందులో సరికొత్తగా మాస్ అవతారంలో కనిపించనున్నారు ఎన్టీఆర్. ఇటీవల విడుదలైన పోస్టర్ మూవీపై ఆసక్తిని కలిగించింది.

 జాన్వీతోపాటు మరో హీరోయిన్ అయిన శృతీ మరాఠే ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనుందని ప్రచారం నడిచింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతీ మరాఠే.. అందరూ అనుకుంటున్నట్టే.. సోషల్ మీడియాలో న్యూసులు వస్తున్నట్టే.. తాను దేవర సినిమాలో యాక్ట్ చేస్తున్నట్టు చెప్పింది.

అంతేకాదు తాను దేవర సినిమాలో ఏ రోల్‌లో కనిపించనున్నారనేది కూడా ఒక్కసారిగా రివీల్ చేసింది ముద్దుగుమ్మ శృతీ మరాఠే.

దేవర సినిమాలో తాను దేవరకు భార్యగా కనిపించబోతున్నాని చాలా ఎగ్జైట్ అవుతూ చెప్పకనే చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ.

అంతేకాదు ఎన్టీఆర్ అభిమానుల మాదిరిగానే తాను కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది శృతి.