TV9 Telugu

30 January 2024

వెరీ పవర్ ఫుల్ పాత్రలో శృతిహాసన్‌.. నెవెర్ ఎక్స్పర్ట్.!

స్టార్ హీరోయిన్ శృతిహాసన్‌ పట్టిందల్లా బంగారమవుతోంది. ఈ భామ సినిమాలన్నీ విజయం సాధిస్తున్నాయి.

గత ఏడాది వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్‌, హాయ్‌ నాన్న సినిమాలు ఈ అమ్మడికి మంచి విజయాలను అందించాయి.

ఈ నేపథ్యంలో కథల ఎంపికలో మరింత వైవిధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుందట శృతిహాసన్‌.

తాజా సమాచారం ప్రకారం తమిళంలో ‘వేలు నాచ్చియార్‌’ అనే వీర వనిత పాత్రలో నటించబోతుందట.

స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న ధీర వనితగా తమిళనాట వేలు నాచ్చియార్‌ ప్రసిద్ధికెక్కింది.

కథ, తన పాత్రలోని ధీరత్వం నచ్చడంతో ఈ సినిమాకు శృతిహాసన్‌ ఓకే చెప్పిందని తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తుంది.

దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మాతృభాష తమిళంలో శృతిహాసన్‌ నటించబోతున్న చిత్రమిదే కావడం విశేషం.

లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది.