వీరవనితగా మారబోతున్న శ్రుతిహాసన్.. నాలుగేళ్ల తర్వాత సొంత భాషలో..
TV9 Telugu
Pic credit - Instagram
గతేడాది వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫాంలో ఉంది హీరోయిన్ శ్రుతిహాసన్. వాల్తేరు వీరయ్య, వీరసింహరెడ్డి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.
ఆ తర్వాత కేవలం సలార్ సినిమా మాత్రమే అనౌన్స్ చేసింది. అలాగే న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ నటించిన హాయ్ నాన్న సినిమాలో గెస్ట్ రోల్ చేసింది శ్రుతిహాసన్.
ఇక గతేడాది చివర్లో సలార్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. అలాగే ఇప్పుడు రవితేజ కొత్త సినిమాలోనూ ఈ బ్యూటీ ఎంపికైందని టాక్ వినిపిస్తుంది.
ఇవే కాకుండా ది ఐ అనే వెబ్ సిరీస్ లోనూ ఛాన్స్ కొట్టేసింది శ్రుతిహాసన్. ఇప్పుడు మరో హాలీవుడ్ చిత్రం ఈమె ఖాతాలో పడినట్లు తెలుస్తోంది. అలాగే మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసింది.
దాదాపు నాలుగేళ్ల తర్వాత సొంత భాషలో నటించనుందట. తమిళ సినిమాల్లో శ్రుతిహాసన్ నటించి చాలా కాలమైంది. విజయ్ సేతుపతి లాభం మూవీలో కనిపించింది శ్రుతిహాసన్.
2021లో ఈ మూవీ రిలీజ్ అయ్యింది. అప్పటి నుంచి మళ్లీ సొంత భాషలో ఏ సినిమా చేయలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిందట.
వేలు నాచ్చియార్ అనే వీరవనిత పాత్రను శ్రుతిహాసన్ చేయబోతుందని టాక్ వినిపిస్తుంది. స్వతంత్ర్య పోరాటంలో పాల్గొన్న తొలి తమిళ నారీమణి వేలు నాచ్చియార్.
ఈ చిత్రానికి రాజేష్ ఎం. సెల్వా దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ చేసిన శ్రుతిహాసన్ మొదటిసారి ఇలాంటి పాత్రలో కనిపిచనుంది.