21 May 2025

శృతి హాసన్‏కు ఏమైందీ ? సినిమాలకు దూరంగా కమల్ కూతురు..

Rajitha Chanti

Pic credit - Instagram

సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోంది. వరుస ప్లాపులతో ఐరన్ లెగ్ అని ట్యాగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ.

తెలుగు, తమిళ్ భాషలలో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన గబ్బర్ సింగ్ మూవీ ఫస్ట్ కమర్షియల్ హిట్ అందుకుంది. 

దీంతో ఈ బ్యూటీ కెరీర్ మలుపు తిప్పింది. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకుంది. 

అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు బ్రేక్ తీసుకుంది. కానీ రవితేజ నటించిన క్రాక్ సినిమాతో తిరిగి స్ట్రాంగ్ రీఎంట్రీ ఇచ్చి మరో హిట్టు అందుకుంది. 

ఆ తర్వాత సలార్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలతో అలరించింది. కానీ కొన్నాళ్లుగా ఈ ముద్దుగుమ్మ సౌత్ ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది. ఒక్క సినిమా అనౌన్స్ చేయలేదు. 

ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రంలో మాత్రమే నటిస్తుంది. అలాగే తమిళంలో వస్తున్న ట్రైన్ సినిమాలో నటిస్తుంది. తెలుగులో ఒక్క సినిమా చేయడం లేదు.

టాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నప్పటికీ శృతి హాసన్ ఆసక్తి చూపించడం లేదని టాక్. కేవలం ఇప్పుడు సలార్ 2 చిత్రంలో మాత్రమే కనిపించనుంది ఈ ముద్దుగుమ్మ

ఈ సినిమా తర్వాత తెలుగులో శృతి హాసన్ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కానీ తమిళంలో మాత్రం  వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది.