కమల్ బయోపిక్.. శృతి ఏమంటుందంటే.?
TV9 Telugu
17 June 2024
హీరోయిన్ గా, సింగర్ గా, డ్యాన్సర్ గా ఇంకా చాల రకాలుగా మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంది స్టార్ నటి శ్రుతిహాసన్.
తాజాగా తన తండ్రి, కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ బయోపిక్ గురించి మాట్లాడింది ఈ వయ్యారి భామ.
ఆమె దృష్టిలో థన్ నాన్న సూపర్ హీరో అంది ఈ బ్యూటీ. ఎప్పుడు కూల్‌గా దర్శకులు చెప్పే కథ తరగతి గదిలో పిల్లాడిలా వింటారంది.
ఎన్నో బాధ్యతలతో కూడిన దర్శకత్వం ఎందరికో స్ఫూర్తినిస్తుందని, తన తండ్రి బయోపిక్‌కు దర్శకత్వం వహించలేనని తెలిపింది.
ఆయన బయోపిక్ తెరకెక్కించడానికి తాను సరైన వ్యక్తిని కాదని, తాను డైరెక్ట్ చేస్తే పక్షపాతంగా తీసినట్లు ఉంటుందని చెప్పింది.
ఇండస్ట్రీలో చాలామంది గొప్ప దర్శకులు ఉన్నారని. వాళ్లైతే అద్భుతంగా తన తండ్రి బయోపిక్ రూపొందించగలరని తెలిపింది.
ఇటీవల ‘ఇండియన్ 2’ ఆడియో రిలీజ్ వేడుకలో కమల్ పాటలను శ్రుతి తన తండ్రి సినిమా పాటలను ఆలపించడం గొప్ప అనుభూతి కలిగిందని అంది.
శ్రుతి హాసన్ ప్రస్తుతం ‘సలార్ పార్ట్ 2: శౌర్యంగపర్వం’, ‘డకాయిట్’లో చిత్రాల్లో నటిస్తుంది. ‘చెన్నై స్టోరీ’లోనూ ముఖ్య పాత్రలో కనిపించనుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి