18 October 2023
మనం అలా షో ఆఫ్ చేస్తే దేవుడు కచ్చితంగా శిక్షిస్తాడు.. శ్రుతి హాసన్.
Pic credit - Instagram
సలార్ సినిమాతో మరికొద్ది రోజుల్లో థియేటర్లలో సందడి చేయబోతుంది శ్రుతిహాసన్. కానీ మరోవైపు తన ఫాలోవర్లను మాత్రం తెగ కన్ఫ్యూజ్ చేస్తుంది ఈ బ్యూటీ.
కొద్దిరోజులుగా తను ఏదో శుభవార్త పంచుకోవాలని ఉందంటూ చెప్పుకొస్తుంది. ఈనెల 26న ఓ ప్రకటన కచ్చితంగా చేయబోతున్నానంటూ ఇప్పటికే చెప్పేసింది.
కానీ ఏ విషయం గురించి అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆమె పెళ్లి ప్రకటన అయ్యుంటుంది అని కొందరు.. కొత్త సినిమా కావచ్చని మరికొందరు అంటున్నారు.
కానీ శ్రుతి మాత్రం నిత్యం తన సోషల్ మీడియా ఖాతాలో ఎంతో జాలీగా ఉన్న ఫోటోస్, వీడియోస్ అప్లోడ్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించింది.
తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో ఓ చిన్న వీడియో షేర్ చేసింది శ్రుతి. తను నాలుగు రోజులుగా ఫ్లూతో బాధపడుతున్నానని.. జ్వరం లక్షణాలున్నాయని తెలిపింది.
ఇప్పుడు అది డెంగ్యూ అయ్యేలా ఉందని.. దేవుడా ప్లీజ్ అలా మాత్రం చేయకు.. 26వ తేదీ వరకు అలాంటివేమీ ఇవ్వొద్దంటూ దేవుడిని వేడుకుంది శ్రుతిహాసన్.
గత కొన్ని రోజులుగా ఫ్లూతో బాధపడుతున్నా.. అదేమీ పట్టించుకోకుండా నేను కాస్త షో ఆఫ్ చేసుకుంటూనే బాగున్నాను అంటూ మీ అందరితో చెప్పుకొచ్చాను.
అలా షో ఆఫ్ చేస్తే దేవుడు కచ్చితంగా శిక్షిస్తాడు. ఇప్పుడు కరోనాలో బాధపడినదానికంటే ఎక్కువగా బాధపడుతున్నాను.. జ్వరం లక్షణాలున్నాయని చెప్పుకొచ్చింది.
ఇక్కడ క్లిక్ చేయండి.