11 November 2025
మహేష్ కోసం రంగంలోకి శ్రుతిహాసన్.. ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ పాడిందంటే
Rajitha Chanti
Pic credit - Instagram
తెలుగులో స్టార్ హీరోయిన్లలో శ్రుతిహాసన్ ఒకరు. అందం, అంతకు మించిన నటనతో దక్షిణాది అడియన్స్ హృదయాల్లో చోటు సంపాదించుకుంది ఈ బ్యూటీ.
కేవలం కథానాయికగానే కాకుండా సింగర్ గానూ సుపరిచితమే. ఇదివరకు తెలుగు, తమిళంలో అనేక పాటలు పాడింది. మరోసారి తన టాలెంట్ బయటకు తీసింది.
దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న SSMB 29 సినిమాకు ఆమె పాడిన పాట ఇటీవల విడుదలైంది. ఇప్పుడు ఆ సాంగ్ ట్రెండ్ అవుతుంది.
ముఖ్యంగా ఈ పాటలో శ్రుతిహాసన్ వాయిస్ కు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ పాటను శ్రుతి ఎంతో అందంగా పాడారంటూ ఆమ్మడు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
దీంతో కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో శ్రుతి పాడిన సాంగ్ ట్రెండింగ్ అవుతుంది. ఈ మూవీకి శ్రుతి పేరుతో హ్యాష్ ట్యా్గ్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఇదివరకు తెలుగులో అనేక పాటలు పాడింది శ్రుతిహాసన్. ఆరేళ్ల వయసులో తండ్రి కమల్ హాసన్ తేవర్ మగన్ చిత్రంలో తన మొదటి పాటను పాడింది శ్రుతి.
అలాగే కమల్ హాసన్ దర్శకత్వం వహించిన హిందీ భాషా చిత్రం చాచి 420 లో పాట పాడింది. ఇప్పటికే సొంతంగా పలు కంపోజ్ చేసి పాడుతూనే ఉన్నారు శ్రుతి.
ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సినిమాల్లో రెండు పాటలను పాడింది శ్రుతి. తెలుగులో హాయ్ నాన్న చిత్రంలో పాడారు. ఇప్పటి వరకు 45కుపైగా పాటలు పాడారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్