04 November 2023
సలార్ పూర్తిగా ప్రభాస్ సినిమా అంటోన్న శ్రుతిహాసన్..
Pic credit - Instagram
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమా సలార్. ఇందులో ప్రభాస్ జోడిగా శ్రుతిహాసన్ నటిస్తోంది.
డిసెంబర్ 22న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా గురించి ఇటీవలే ఇంటర్వ్యూలో శ్రుతిహాసన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
సలార్ సినిమా గురించి మాట్లాడుతూ.. అది పూర్తిగా ప్రభాస్ సినిమా అని.. అందులో కేవలం తను ఓ పాత్రలో నటిస్తున్నానని తెలిపింది.
ప్రభాస్ ఎంతో కష్టపడి తన కెరీర్ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు. ప్రశాంత్ నీల్ తన పంథాలో తను సినిమాలు చేస్తున్నారని తెలిపింది.
ఇక ఈ సినిమాలో తను కథానాయికగా నటించానని.. కానీ అది పూర్తిగా ప్రభాస్ సినిమా అంటూ చెప్పుకొచ్చింది శ్రుతిహాసన్..
శ్రుతి హాసన్ చేసిన కామెంట్స్ పట్ల ఫ్యాన్స్ పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
కేజీఎఫ్ తర్వాత నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యా్ప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
అనేకసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో రిలీజ్ కానుంది.
ఇక్కడ క్లిక్ చేయండి.