04 July 2024
అలాంటి క్వశ్చన్స్ అడక్కండి.. చిరాకొస్తుంది.. శ్రుతి హాసన్..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం హీరోయిన్ శ్రుతి హాసన్ సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఇటీవలే శంతను హజారికతో బ్రేకప్ జరిగిన సంగతి తెలిసిందే.
ఈ బ్రేకప్ గురించి శ్రుతిహాసన్ ప్రత్యక్షంగా స్పందించలేదు. కానీ ప్రస్తుతం తాను సింగిల్ అని మింగిల్ అయ్యేందుకు రెడీ అంటోంది.
లవ్, బ్రేకప్ గురించి అడగ్గా శ్రుతి హాసన్ ఎలాంటి ఆన్సర్ ఇవ్వడం లేదు. తాజాగా పెళ్లిపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది ఈ బ్యూటీ.
తాజాగా ఇన్ స్టాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఇందులో ప్రేమ గురించి ఆసక్తికర ఆన్సర్ ఇచ్చింది శ్రుతి హాసన్.
మీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటీ ? అని ఓ నెటిజన్ అడగ్గా.. లవ్ అనేది క్రేజీ ఫీలింగ్ అని.. జీవితాలను నడిపించేది ప్రేమ, పని పట్ల ప్రేమ అని తెలిపింది.
ఇక మీ పెళ్లి ఎప్పుడు అని మరో నెటిజన్ అడగ్గా.. ఎందుకు..? నీ పెళ్లెప్పుడు ? ఇవన్నీ విసిగించే ప్రశ్నలు ఇంకోసారి ఇలంటివి అడక్కండి అని తెల్చేసింది.
పెళ్లెప్పుడు చేసుకుంటున్నావ్ అని మరో నెటిజన్ అడిగితే.. నేను చేసుకోను సర్ అంటూ సింపుల్ గా రిప్లై ఇచ్చేసింది. ప్రస్తుతం శ్రుతి కామెంట్స్ వైరలవుతున్నాయి.
2024లో మహిళలను పెళ్లెప్పుడు..? కాబోయే వాడిలో ఎలాంటి లక్షణాలుండాలని కోరుకుంటున్నావ్ ? ఇలాంటి ప్రశ్నలు అడగడం మానేయండి అని తెలిపింది.
ఇక్కడ క్లిక్ చేయండి.