బ్రేక్‌  వచ్చింది మాత్రం తెలుగు ఇండస్ట్రీ వల్లే: శృతి హాసన్

Anil Kumar

05 July 2024

హీరో కమల్‌హాసన్‌ నటించిన దశావతారం సినిమాతో సంగీత దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వాల్సింది శ్రుతిహాసన్‌. అయితే..

అప్పుడు కమల్‌ హాసన్‌ ఎంతగానో ఎంకరేజ్‌  చేసినప్పటికీ.. కొన్ని కారణాల శృతి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారట.

తన లైఫ్‌ లోకి ఫస్ట్ వచ్చింది మ్యూజిక్‌ అని, ఆ తర్వాతే సినిమాలు, నటన వచ్చాయని అంటున్నారు మిస్‌ హాసన్‌.

ఇక సినిమాల్లో హీరోయిన్ గా కెరియర్ స్టార్టింగ్ లో వరస అపజయాలు ఎదుర్కున్న శృతి.. తాజాగా దీనిపై మాట్లాడారు.

ఎన్ని సినిమాలు ఫ్లప్స్ తరువాత పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకుంది శృతి హాసన్.

తాజాగా మంచి కథల్ని ప్రామాణికంగా చెప్పడానికి సామాజిక మాధ్యమాలు ఉపయోగపడ్డాయని అన్నారు నటి శ్రుతిహాసన్‌.

ఒకటి కాదు ఏ విధంగా అయినా.. సంగీతం, కవిత్వం, వీడియో అంటూ ఏ రూపంలోనైనా కథలను చెప్పవచ్చని అన్నారు శ్రుతి.

తనకు మంచి బ్రేక్‌ వచ్చింది మాత్రం తెలుగు ఇండస్ట్రీ వల్లేనని.. మరోసారి చెప్పుకొచ్చారు హీరోయిన్ శ్రుతి.