ట్రెండీ వేర్ లో మెరిసిన శృతిహాసన్.. పిక్స్ చూస్తే మైండ్ బ్లాకే 

TV9 Telugu

07 June 2024

శృతిహాసన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచేయాల్సిన పని లేదు .. అనగనగా ఒక ధీరుడు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.

కమల్ హాసన్ కూతురుగా ప్రేక్షకులకు పరిచయమైన ఆ తరువాత తన నటనతో.. ప్రెకషకుల దగ్గర మంచి పేరు తెచ్చుకుంది ఈ నటి.

కాగా శృతిహాసన్ కెరియర్ మొదట్లో తెలుగులో అన్ని ఫ్లాప్స్ వచ్చాయి. దాంతో ఆమెని అప్పట్లో ఐరన్ లెగ్ అని కూడా అనేవాళ్ళు.

కానీ పవన్ కళ్యాణ్ తో శృతిహాసన్ చేసిన గబ్బర్ సింగ్ సినిమా ఆమె కెరియర్ ని మార్చేసింది.  గబ్బర్ సింగ్ చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా శృతిహాసన్ కి ఎన్నో ఆఫర్లు తీసుకొచ్చింది.

అప్పటినుంచి శృతిహాసన్ గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. ఆ తరువాత వచ్చిన శృతిహాసన్ సినిమాలు అన్నీ కూడా దాదాపు.. మంచి విజయం సాధించినవే.

తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ ఇండస్ట్రీలలో కూడా ఎన్నో సినిమాలలో నటించింది శృతిహాసన్. అంతేకాకుండా సింగర్ గా కూడా ఈ హీరోయిన్ కి మంచి పేరు ఉంది.

 ఇక ప్రస్తుతం శృతిహాసన్ డెకాయిట్,  సలార్ 2 సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉంది. ఈ క్రమంలో శృతిహాసన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.