అలాంటి చిత్రాల్లో నటించా.. అందుకు సిగ్గుపడటంలేదంటున్న శ్రుతిహాసన్
Phani CH
29 JULY 2024
శృతిహాసన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచేయాల్సిన పని లేదు .. అనగనగా ఒక ధీరుడు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.
కమల్ హాసన్ కూతురుగా ప్రేక్షకులకు పరిచయమైన ఆ తరువాత తన నటనతో.. ప్రెకషకుల దగ్గర మంచి పేరు తెచ్చుకుంది ఈ నటి.
కాగా శృతిహాసన్ కెరియర్ మొదట్లో తెలుగులో అన్ని ఫ్లాప్స్ వచ్చాయి. దాంతో ఆమెని అప్పట్లో ఐరన్ లెగ్ అని కూడా అనేవాళ్ళు.
ఇది ఇలా ఉంటె తాజాగా ఆమె ఓ ఆంగ్ల ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి నటిగా తెరంగేట్రం చేసిన సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి స్పందించింది.
నా సినిమా గురించి ఓ పేపర్‌లో వచ్చిన రివ్యూ చూసి బాధపడ్డా. నా స్థానంలో వేరే ఎవరైనా ఉంటే సినీ రంగాన్ని వదిలి వెళ్లిపోయేవారు. నేను మాత్రం ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నా.
ప్రతి సినిమా నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఈ స్థాయికి వచ్చా. కమర్షియల్ చిత్రాల్లో నటించా. అందుకు సిగ్గుపడటం లేదు. అవి మంచి విజయాలు అందించాయి. విశేష ప్రేక్షకాదరణ సొంతం చేశాయి.
నాకెంతో నచ్చి కష్టపడి వర్క్ చేసిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాలేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ నాకొక ఇల్లు. ఇక్కడ బంధుప్రీతి ఉంది. నా తల్లిదండ్రులు ఏమాత్రం సాయం చేయలేదు.
‘‘నాన్నా.. నాకు అవకాశాలు రావడం లేదు నేనేం చేయాలి?’’ అని చెప్పాలనిపించిన సందర్భాలున్నాయి. కానీ, వాటిని నేనే ఎదుర్కొన్నా’’ అని శ్రుతిహాసన్ తెలిపారు.