శృతి హాసన్ మునపటి స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోతున్నారా..? 

11 December 2023

ఓ వైపు చిరంజీవి.. మరోవైపు బాలయ్య సినిమాల్లో హీరోయిన్‌గా శృతి హాసన్ నటిస్తుందని తెలియగానే ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.

ఈ రెండు సినిమాలు హిట్టైనా కూడా శృతి హాసన్ కారెక్టర్ లెంత్ చూసాక.. ఆమె వీరాభిమానులు సైతం షాక్ అయ్యారు.. నిరాశ పడ్డారు.

వాల్తేరు వీరయ్యలో అయినా కనీసం కథలో కొద్దో గొప్పో శృతి కారెక్టర్ ఇన్వాల్వ్ అయింది కానీ వీరసింహారెడ్డిలో మాత్రం పాటలకు పరిమితైపోయింది.

పవన్ కళ్యాణ్ సినిమా అంటే గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందనుకుంటే.. వకీల్ సాబ్‌లో 15 నిమిషాల పాత్ర చేసారు శృతి.

వీటితో పోలిస్తే క్రాక్‌లో ఖతర్నాక్ కారెక్టర్ చేసారు శృతి హాసన్. కథలో ముఖ్యమైన పాత్రే కాదు.. ఫైట్స్ కూడా ఇరగదీసారు ఈ భామ.

హాయ్ నాన్నలో ఏ మాత్రం ఇంపార్టెన్స్ లేని పాత్రలో నటించారు శృతి హాసన్. ఏదో ఓ పాటలో అలా మెరిసి మాయమైపోతారు.

సలార్‌లోనూ శృతి హాసన్ కారెక్టర్ అలాగే ఉంటుందా లేదంటే ఏదైనా లెంత్ ఉంటుందా అనేది విడుదల అయ్యాక చూడాలి.

ట్రైలర్‌లో మాత్రం ఒక్క షాట్‌కే పరిమితం చేసారు దర్శకుడు ప్రశాంత్ నీల్. రానున్న రోజుల్లోనూ శృతి కారెక్టర్స్ ఇలాగే ఉంటే ఆమెను మరిచిపోవడమే ఇక.