ఆచితూచి అడుగులేస్తున్న అందాల శ్రుతి హాసన్ 

september 2

Rajeev 

అందాల భామ శ్రుతీహాసన్ ఆచితూచి సినిమాలు చేస్తుంది. రీసెంట్ డేస్ లో వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ హిట్స్ అందుకుంటుంది.

కెరీర్ బిగినింగ్ లో సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూసిన శ్రుతిహాసన్ ఆతర్వాత వరుసగా విజయాలను అందుకుంది.

తక్కువ సమయంలోనే ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కు అందుకుంటూ దూసుకుపోతుంది.

తెలుగు తమిళ్ సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తుంది శ్రుతిహాసన్. మొన్నామధ్య హిందీలోనూ ట్రై చేసింది.. కానీ అక్కడ లక్ కలిసి రాలేదు.

దాంతో ఇప్పుడు తెలుగు. తమిళ్ సినిమాల పైనే ఎక్కువ దృష్టిపెడుతుంది ఈ చిన్నది. ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్  హీరోగా నటించిన కూలీ సినిమాతో హిట్ అందుకుంది.

ఇప్పుడు సలార్ 2లో నటిస్తుంది. శ్రుతి కేవలం నటిగానే కాదు సింగర్ గాను తన ప్రతిభ చాటుకుంటుంది.

ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా సినిమాల్లోనూ పాడుతుంది. మొన్నామధ్య నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలోనూ ఓ పాట పాడింది.

సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ వయ్యారి భామ.