దెయ్యంలా ఉన్నావని కామెంట్స్ చేసిన పట్టించుకోను.. శ్రుతిహాసన్..
TV9 Telugu
Pic credit - Instagram
ఇటీవలే సలార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకుంది శ్రుతిహాసన్. ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో రెండు మూడు చిత్రాలు ఉన్నాయి. అందులో ఓ హాలీవుడ్ మూవీ కూడా.
ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. అటు సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా తనపై వచ్చే ట్రోల్స్ పై స్పందించింది.
ఒక మహిళా ఆర్టిస్టు పొగడ్తలే కాదు.. అప్పుడప్పుడు విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని.. ఇతరుల అభిప్రాయాలకు భయపడటం.. బాధపడడంలాంటివి చేయదట.
తనకు మొదటి నుంచి నలుపు రంగు.. లోహాభరణాలు ధరించడం అంటే ఇష్టమని.. మెటల్స్ను కేవలం సంగీతంపై ఇష్టం ఉన్నవారు మాత్రమే ధరించరని.. అవి తనలో శక్తిని పెంచుతాయట.
కానీ ఈ ఆభరణాలు నచ్చని కొందరు దెయ్యంలా ఉన్నావని కామెంట్ చేస్తారని.. అలాంటి ట్రోల్స్ ను తాను పెద్దగా పట్టించుకోనని తనపై వచ్చే ట్రోల్స్ పై గట్టి కౌంటరిచ్చింది.
తను న్యాచురల్ బ్యూటీ కాదని వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ఆ విషయం తను కూడా ఒప్పుకుంటానని.. కానీ అద్దంలో తనను తాను చూసుకున్నప్పుడు ఇష్టపడతానని చెప్పింది.
అందరూ అందరికీ నచ్చరని.. ఎవరైనా తనను దెయ్యం, భూతం అని పిలిచినా దాన్ని పొగడ్తగానే భావిస్తానని.. అంతేకానీ తనపై వచ్చే విమర్శల గురించి అసలు బాధపడను అంటుంది.
శ్రుతిహాసన్ కు నలుపు రంగు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు నలుపురంగు దుస్తుల్లోనే ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. దీనిపై ఎప్పుడూ ట్రోల్స్ వస్తూనే ఉంటాయి కానీ తను రియాక్ట్ కాదు.