27 March 2025

ఆ స్టార్ హీరోని చూసి అవే నేర్చుకున్నా..: శ్రుతిహాసన్ 

Rajeev 

Pic credit - Instagram

అందాల భామ శ్రుతి హాసన్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.

ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటూ హిట్స్ అందుకుంటుంది. అంతే కాదు పాన్ ఇండియా సినిమాల్లోనూ ఆఫర్స్ అందుకుంటుంది. 

ఈ మధ్య శ్రుతిహాసన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్స్ గా నిలుస్తున్నాయి. సలార్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారింది. 

ఇప్పుడు బడా సినిమాలను లైనప్ చేసింది. వాటిలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమా ఒకటి.

ఈ సినిమాతో పాటు సలార్ 2లోనూ నటిస్తుంది. అలాగే మరికొన్న్ని ప్రాజెక్ట్స్ కూడా ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి.

తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది శ్రుతిహాసన్ 

ఆయన క్రమశిక్షణ, అంకితభావం, పాత్ర కోసం కష్టపడేతత్వం ఇలా ఎన్నో విషయాల్లో ఆయన్ని చూసి నేర్చుకున్నాను అని తెలిపింది.