నెటిజన్స్ పై శృతి హాసన్ ఫైర్..  సల్మాన్‌కి విషెస్ చెప్పిన వెంకీ..

29 December 2023

TV9 Telugu

తాజాగా సోషల్ మీడియాలో పెళ్లి విషయంలో ట్రోలింగ్ పై నెటిజన్స్ పై ఫైర్ అయ్యారు స్టార్ హీరోయిన్ శృతి హాసన్.

తనకింకా పెళ్లి కాలేదని అన్నారు శ్రుతిహాసన్‌. ప్రతి విషయాన్నీ ప్రేక్షకులతో పంచుకునే తాను, పెళ్లి గురించి దాచనని అన్నారు.

ప్రముఖ డూడుల్‌ ఆర్టిస్ట్ శంతనుతో ఆమె ప్రేమలో ఉన్నారు. ఈ ఏడాది నాలుగు సినిమాల సక్సెస్‌లతో ప్రేక్షకులను అలరించారు శ్రుతి.

ఈ ఏడాది వీరసింహరెడ్డి, వాల్తేర్ వీరయ్య, సలార్ తో మూడు బ్లాక్ బస్టర్స్ అందుకుంది. హాయ్ నాన్నలో అతిథి పాత్రలో కనిపించింది.

తాజాగా గురువారం బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ పుట్టినరోజు సందర్భంగా విష్ చేశారు విక్టరీ వెంకటేష్‌.

ఈ సందర్భంగా టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ సోషల్ మీడియాలో పంచుకున్న ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది.

వెంకటేష్‌ హీరో నటించిన సైంధవ్‌ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్.

శైలేష్ కొలను దర్శకత్వం వహించిన చిత్రమిది. శుక్రవారం ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్‌ విడుదల చేయనున్నారు.