టాలీవుడ్లో లక్కీ హీరోయిన్.. శ్రుతి ఏ సినిమా చేసినా హిట్టే..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తొచ్చేస్తున్న పేరు శ్రుతి హాసన్. తెలుగు సినీ పరిశ్రమలో ఈ బ్యూటీకి ఇప్పుడు మంచి టైమ్ నడుస్తోందనే చెప్పాలి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల సరసన నటించి హిట్స్ అందుకుంటుంది. ఈ ఏడాది ఈ బ్యూటీ నటించిన నాలుగు సినిమాలు సూపర్ హిట్ కావడం విశేషం.
ఈ ఏడాది ప్రారంభంలో రెండు సూపర్ హిట్ అందుకుంది శ్రుతి. చిరు సరసన వాల్తేరు వీరయ్య.. బాలకృష్ణ జోడిగా వీరసింహారెడ్డి చిత్రాల్లో నటించి మెప్పించింది శ్రుతి.
ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇటీవల నాని, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన హాయ్ చిత్రంలోనూ గెస్ట్ రోల్ పోషించింది.
ఆ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రబాస్ సరసన సలార్ చిత్రంలో నటించింది శ్రుతి హాసన్. ఇందులో ఆద్య పాత్రలో కనిపించింది.
ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సలార్ చిత్రం రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. దీంతో మరోసారి శ్రుతి ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడింది. దీంతో ఇప్పుడు శ్రుతి పేరు వినిపిస్తుంది.
తమిళంలో కాకుండా తెలుగులో శ్రుతికి అదృష్టం కలిసొస్తుందని.. ఈ అమ్మడు నటించిన అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బారీ విజయాన్ని అందుకుంటున్నాయంటూ ప్రచారం నడుస్తుంది.
ప్రస్తుతం రవితేజతో మరోసారి నటిస్తుంది శ్రుతి. అలాగే కన్నడంలో ఒక సినిమా.. ఆంగ్లంలో మరో సినిమా చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అటు గాయనిగానూ రాణిస్తుంది.