ఈ వయ్యారి తనువుపై వాలిన ఆ చీరది ఏనాటి పుణ్యమో.. శృతి ఫొటోస్ వైరల్..
TV9 Telugu
15 May 2024
28 జనవరి 1986న తమిళనాడు రాజధాని మద్రాస్ (ఇప్పుడు చెన్నై)లో జన్మించింది 37 ఏళ్ల వయ్యారి భామ శృతి హాసన్.
నటులు కమల్ హాసన్, సారిక ఠాకూర్ దంపతులు ఈ అందాల తార తల్లిదండ్రులు. వీరిద్దరూ 2004లో విడాకులు తీసుకున్నారు.
ఈమె చెల్లెలు అక్షర హాసన్ కూడా నటి. నటుడు చారుహాసన్ ఆమె మేనమామ. నటీమణులు సుహాసిని మణిరత్నం అను హాసన్ బంధువులు.
శృతి హాసన్ చెన్నైలోని లేడీ ఆండాల్ పాఠశాల నుండి పాఠశాల విద్యను పూర్తి చేసి, ముంబైలో సెయింట్ ఆండ్రూస్ కళాశాలలో సైకాలజీలో డిగ్రీని పొందింది.
యునైటెడ్ స్టేట్స్ లో కాలిఫోర్నియాలోని మ్యూజిషియన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో సంగీతం నేర్చుకుంది ఈ అందాల భామ.
మహాత్మా గాంధీపై హత్యాయత్నం ఆధారంగా వచ్చిన హే రామ్ మూవీలో వల్లభ్‌భాయ్ పటేల్ కుమార్తెగా అతిధి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తొలిసారి నటించింది.
తరువాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఆకట్టుకుంది సొగసరి భామ శృతి హాసన్.
2023 మొదట్లో నటించిన వాలైర్ వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు విజయాన్ని సాధించాయి. ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి