25 November 2023

2024కు రాలేమంటున్న మన హీరోయిన్స్ 

2024 సంక్రాంతిని సెలబ్రేట్‌ చేసుకోవడం లేదు శ్రుతిహాసన్‌. ఆమె రూట్లోనే ట్రావెల్‌ చేస్తున్నారు రష్మిక మందన్న. 

కాకపోతే ఈ ఇయర్‌కి గ్రాండ్‌గా ఫేర్‌వెల్‌ ఇచ్చి, 2024లోనూ అదే పాజిటివ్‌ వైబ్స్ ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారు శ్రుతి, రష్మిక.

ఏడాది మొత్తం ఎన్ని సినిమాల రిలీజుల్ని చూసినా రాని శాటిస్‌ఫేక్షన్‌, జనవరిలో వచ్చే పెద్ద పండక్కి ఒక్క సినిమా రిలీజ్‌ అయినా వచ్చేస్తుంది.

అలాంటిది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి అంటూ బ్యాక్‌ టు బ్యాక్‌ రిలీజుల్ని ఎంజాయ్‌ చేశారు శ్రుతి. 

 హాయ్‌నాన్నలో కీ రోల్‌ చేసిన ఈ బ్యూటీ, సలార్‌లో హీరోయిన్‌గా నటించారు ఈ రెండు సినిమాలు ఇయర్‌ ఎండింగ్‌ రావడంతో 2024 పొంగల్‌ రేస్‌ని మాత్రం మిస్‌ అవుతున్నారు. 

తన అభిమాన నటుడు విజయ్‌ పక్కన రష్మిక నటించిన వారిసు ఈ ఇయర్‌ పొంగల్‌కి రిలీజ్‌ అయింది. నిజంగా పండగ వచ్చిందని హ్యపీడేస్‌ని ఎంజాయ్‌ చేశారు రష్మిక. 

వయొలెన్స్ కా బాప్‌ అన్నట్టుండే యానిమల్ రిలీజ్‌తో ఈ ఇయర్‌కి గుడ్‌బాయ్‌ చెప్పనున్నారు నేషనల్‌ క్రష్‌. 

నెక్స్ట్ పొంగల్‌కి ఎలాగూ రిలీజులు లేవు కాబట్టి, ఈ ఇయర్‌ పాజిటివ్‌ వైబ్స్ నే కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యారు.