నాకు చిన్నప్పటి నుంచే అదే పిచ్చి.. 19 ఏళ్లకే: శ్రుతిహాసన్‌.

15 September 2023

 ఈ ఏడాది వాల్తేరు వీరయ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ సొంతం చేసుకుంది శ్రుతిహాసన్‌

ప్రస్తుతం ప్రభాస్‌ సరసన సలార్‌ సినిమాలో నటిస్తోంది. ప్రశాంత్‌ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు

సెప్టెంబర్‌ 28న విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలతో వాయిదా పడింది. నవంబర్‌లో రిలీజ్‌ కానుంది

తాజాగా సోషల్‌ మీడియాలో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చింది శ్రుతి హాసన్‌

తనకు చిన్నప్పటి నుంచే ట్యాటూల పిచ్చి ఉందని, 19 ఏళ్లకే తొలి ట్యూటూ వేయించుకున్నానంది శ్రుతి

అలాగే హీరోయిన్‌ కాకపోయి ఉంటే మొహం మీద తప్పా బాడీ అంతా ట్యాటూలు వేయించుకునేదట ఈ అందాల తార

మొత్తానికి టాటూలంటే అంత పిచ్చి అని చెప్పుకొచ్చింది శ్రుతి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి