అందంలో అమరత్వం పొందిందేమో ఈ వయ్యారి భామ..
05 October 2023
శ్రియ శరన్ అంటే తెలియని వారుండరు. తెలుగు, తమిళ హిందీ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
2001లో ఇష్టం సినిమాతో సినీ అరంగేట్రం చేసింది ఈ అందాల తార. ఈ చిత్రంలో అందంతో మెప్పించింది ఈ వయ్యారి భామ.
తర్వాత 2002లో సంతోషం, చెన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది.
2003లో రితీష్ దేశ్ ముఖ్ సరసన తుజే మేరీ కసమ్ అనే చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది అందాల తార శ్రియ.
తర్వాత నీకు నేను నాకు నువ్వు, ఠాగూర్, ఎలా చెప్పను వంటి చిత్రాలతో తెలుగులో డబల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది ఈ బ్యూటీ.
2003లో ఎనక్కు 20 ఉనక్కు 18 (తెలుగులో నీ మనసు నాకు తెలుసు) అనే చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.
తర్వత నేనున్నాను, నా అల్లుడు, ఛత్రపతి వెంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో చిత్రాల్లో నటించింది. ఎన్నో అవార్డ్స్ కూడా పొందింది.
2022లో రాజమౌళి తరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీలో ఓ కీలక పాత్రలో కనిపించింది. ఇటీవల మ్యూజిక్ స్కూల్ అనే చిత్రంలో నటించింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి