07 September 2025

వయసు 42 సంవత్సరాలు.. కుర్ర హీరోయిన్లకే గుబులు పుట్టిస్తోన్న బ్యూటీ

Rajitha Chanti

Pic credit - Instagram

ఒకప్పుడు దక్షిణాదిని ఏలిన హీరోయిన్. అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం ఆమె వయసు 42 సంవత్సరాలు. అయినప్పటికీ పాతికేళ్ల అమ్మాయిల కనిపిస్తూ షాకింగ్ ఫిట్నెస్ తో ఆశ్చర్యపరుస్తుంది.

ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ శ్రియా శరణ్. 1982 సెప్టెంబర్ 11న ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీలో జన్మించింది. 

చిన్నవయసులోనే క్లాసిక్, కథక్ డ్యాన్సులు నేర్చుకుంది. 2001లో ఇష్టం సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది.

ఆ తర్వాత నాగార్జునతో కలిసి నటించిన సంతోషం సినిమా ఆమె కెరీర్ మలుపు తిప్పింది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. 

మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. 

తెలుగు, తమిలం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పటికీ సినిమాల్లో కొనసాగుతుంది.

ఇప్పుడు 42 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిల కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంద. ఇప్పుడు ఈ బ్యూటీ సరైన ఛాన్స్ కోసం చూస్తుంది.