అందుకే తెలుగు సినిమాలు చేయలేదన్న శ్రద్ధా శ్రీనాథ్.. హనుమాన్ అప్‌డేట్..

TV9 Telugu

04 January 2024

జెర్సీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్. అందులో తనదైన నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు ఈ భామ.

కానీ ఆ తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు. ఆఫర్స్ రాలేదేమో అనుకున్నారు కానీ తాజాగా సైంధవ్ ప్రమోషన్స్‌లో ఈ విషయాన్ని మాట్లాడారు.

తనకు జెర్సీ తర్వాత కథలు నచ్చలేదని.. చాలా రోజుల తర్వాత ఆ స్థాయి కథ సైంధవ్‌లోనే కనిపించిందని చెప్పుకొచ్చారు. జనవరి 13న సైంధవ్ విడుదల కానుంది.

సంక్రాంతి సినిమాల్లో ప్రమోషన్ పరంగా చూసుకుంటే హనుమాన్ అందరికంటే ముందుంది. ఇది మొదటి తెలుగు సూపర్ హీరో ఫిల్మ్.

చిన్న సినిమాగానే వస్తున్నా కూడా అంచనాలు మాత్రం హనుమాన్‌పై భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో తేజా సజ్జా హీరోగా నటిస్తుండగా.. ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నారు.

రిలీజ్ లోపే సినిమా నుంచి మరో పాటతో పాటు రిలీజ్ ట్రైలర్ కూడా విడుదల చేస్తామని చెప్తున్నారు దర్శక నిర్మాతలు. జనవరి 12న హనుమాన్ విడుదల కానుంది.

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్న సినిమా తండేల్. సముద్రం నేపథ్యంలోనే ఈ చిత్రం వస్తుంది.

దీనికోసం చైతూతో పాటు సాయి పల్లవి కూడా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు. గీతా ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

జనవరి 5 సాయంత్రం 5 గంటలకు తండేల్ టీజర్ విడుదల చేయబోతున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.