04 March 2025

ఆస్తులు రూ.130 కోట్లు.. 60 కోట్ల ఇల్లు.. ఈ హీరోయిన్ రేంజ్ చూస్తే

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. నివేదికల ప్రకారం ఆమె అస్తులు రూ.130 కోట్లు. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు రెమ్యునరేషన్. 

ఆమె మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. 16 ఏళ్ల వయసులోనే ఆమెకు ఫస్ట్ మూవీ ఛాన్స్ వచ్చింది. కానీ అప్పుడు ఆమె ఆ ఛాన్స్ రిజెక్ట్ చేసింది. 

హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. కొద్ది రోజుల క్రితం స్త్రీ 2 సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ తిరగరాసింది. 

బాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 12 ఏళ్లకు పైగా సినిమాల్లో నటిస్తుంది. అంతేకాకుండా 2015లో ఆమె ఫోర్బ్స్ ఇండియా సెలబ్రెటీల జాబితాలో చేరింది. 

శ్రద్ధా కపూర్ ఆస్తులు రూ.130 కోట్లు అని సమాచారం. అంతేకాకుండా ఆమె ఒక్కో సినిమాకు దాదాపు రూ.5 కోట్లు వరకు పారితోషికం తీసుకుంటుందట. 

అలాగే ఆమె నెలకు రూ.1.2 కోట్లు సంపాదిస్తుంది. బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, వ్యాపారరంగంలోనూ శ్రద్ధా కపూర్ భారీగా సంపాదిస్తుందట. 

శ్రద్ధా తన కుటుంబంతో కలిసి ముంబైలోని జుహులో సముద్రానికి ఎదురుగా ఉన్న ఒక విలాసవంతమైన ఇంట్లో నివసిస్తుంది. ఈ ఇంటి విలువ రూ.60 కోట్లు. 

ఇటీవలే రూ.4 కోట్ల విలువైన లంబోర్గిని హురాకాన్ టెక్నికాను కొనుగోలు చేసింది. శ్రద్ధకు ఇమారా అనే సొంత ఫ్యాషన్ లేబుల్ ఉందని మీకు తెలుసా..