TV9 Telugu
29 January 2024
ఆ హీరోయిన్ నన్ను కొట్టింది.. హాస్పటల్‌లో చేరాను: శ్రద్ధా దాస్.
శ్రద్ధా దాస్.. హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన ఈ భామ ఇప్పుడు సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది.
తెలుగుతో పాటు హిందీలోనూ నటించి మెప్పిస్తుంది శ్రద్ధా దాస్.
ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ తనను దారుణంగా కొట్టిందని దాంతో హాస్పటల్ లో చేరారని తెలిపింది.
ఇంతకు ఈ అమ్మడిని కొట్టిన ఆ హీరోయిన్ ఎవరో కాదు మన్నారా చోప్రా. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కజిన్ ఈ అమ్మడు.
ప్రేమ గీమ జాన్‌తా నయ్ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది మన్నారా చోప్రా.
మన్నారా చోప్రా, శ్రద్ధా దాస్ కలిసి హిందీలో ఓ సినిమాలో నటించారు. అయితే ఆ సినిమా షూటింగ్ లో ఈ ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిందట.
ఓ ఫైట్ సీన్ లో డమ్మీ స్టిక్ తో కొట్టాల్సింది రియల్ స్టిక్ తో కొట్టడంతో నా కంటికి గాయం అయ్యింది.
దాంతో నేను హాస్పటల్ లో చేరాల్సి వచ్చింది అని తెలిపింది శ్రద్దా.. ఇది జరిగి చాలా కాలం అయ్యింది.
ఇప్పుడు ఈ విషయం పై ఇప్పుడు మాట్లాడటానికి నిరాకరించింది శ్రద్దా. ప్రస్తుతం మన్నారా హిందీ బిగ్ బాస్ సీజన్ 17లో పాల్గొంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి.