సెగలు రేపుతున్న శివాత్మిక.. రెడ్ డ్రెస్‌లో హాట్ 'మిర్చి'..

19 September 2023

హీరో రాజశేఖర్, జీవిత దంపతుల చిన్న కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శివాత్మిక రాజశేఖర్. మొదటి చిత్రంతోనే ఆకట్టుకుంది.

'దొరసాని' చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైంది శివాత్మిక రాజశేఖర్. తొలి సినిమాతోనే తన నటనకు మంచి మార్కులు సాధించింది.

ఆ తర్వాత 'కల్కి', 'పంచతంత్రం', 'రంగమార్తాండ' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళంలో కూడా చిత్రాలు చేస్తుంది.

సోషల్ మీడియాలో ఎలప్పుడూ యాక్టివ్‌గా ఉండే శివాత్మిక.. సరికొత్త ఫ్యాన్స్ డ్రెస్సింగ్‌తో, సెన్సేషనల్ ఫోటోలతో కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది.

ఈ క్రమంలోనే రీసెంట్‌గా దుబాయ్‌లో సైమా అవార్డులకు హాజరైన శివాత్మిక.. అక్కడ రెడ్ కలర్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.

రెడ్ కలర్ డ్రెస్‌లో.. విభిన్న యాంగిల్స్‌లో హాట్ హాట్ పోజులిస్తూ.. ఫోటోలు దిగింది శివాత్మిక రాజశేఖర్.

అలాగే ఈ చిత్రాలకు 'మంచి అమ్మాయిలంతా నరకానికి వెళ్తారు’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది శివాత్మిక రాజశేఖర్.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌ వర్షం కురిపిస్తున్నారు.